గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలన్న నారాయణ
తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళి సై పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. గవర్నర్ అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యవహరించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోలేడని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లలేడని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేయడమెందుకన్నారు. అసెంబ్లీ రద్దు చేయడం సాధ్యం కాదని గవర్నర్ చెప్తున్నారని… ఆమె ఎలా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు నారాయణ. కేసీఆర్ పొలిటికల్ డిసిషన్ మారుతుంటాయని… ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లారని.. ఏం చేస్తారో చూడాలన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి వెళ్తే ఆహ్వానిస్తామన్న నారాయణ… లేదంటే రాజకీయంగా వ్యతిరేకిస్తామన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా… గవర్నర్ ఎందుకు ఆయన దేశ రాజకీయాలకు పోరని చెప్తారని ప్రశ్నించారు. ఇది గవర్నర్ పరిధి దాటుతున్నారని… తక్షణమే గవర్నర్‌ను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు నారాయణ…