NationalNewsNews Alert

‘లిక్కర్‌ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!

Share with

ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛతీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి బందీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరాలను ప్రేరేపించే మద్యానికి ప్రత్యామ్నాయంగా భాంగ్ మరియు గంజాయి వాడకాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే చేసిన ప్రసంగం వివాదానికి దారితీసింది. లిక్కర్ వల్లే దేశంలో అత్యాచారాలు,హత్యలు,దోపిడీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.గంజాయితో అలాంటి నేరాలు జరగవని జోస్యం చెప్పారు.

కృష్ణమూర్తి బందీ మార్వాహి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, మేము ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తాం. జూలై 27న మరోసారి చర్చకు రానుంది.
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించాను. అత్యాచారం, హత్యలు, వివాదాల వంటి నేరాలకు మద్యమే కారణమని చెప్పాను. గంజాయి తాగినవారు ఎప్పుడైనా అత్యాచారం, హత్య ,దోపిడీ వంటి నేరాలకు పాల్పడ్డారా? అని అసెంబ్లీలోనే అడిగాను అని కృష్ణమూర్తి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కమిటీని వేసింది.. బహుశా ప్రజలు డ్రగ్స్ కావాలనుకుంటే, హత్యలు, అత్యాచారం, ఇతర నేరాలకు వారిని ప్రేరేపించని వాటిని మనం వారికి అందించాలని కృష్ణమూర్తి బందీ చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను బిలాస్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభయ్ నారాయణ్ రాయ్ ఖండించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణమూర్తి బందీ సమాజాన్ని మాదకద్రవ్యాల నుంచి విముక్తి చేసే మార్గాలను చెప్పే బదులు మాదకద్రవ్యాల వ్యసనాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.