సీబీయస్‌ఈ 10 వ తరగతి ఫలితాలు విడుదల
ఎప్పుడెప్పుడా అని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సీబీఎస్‌ఈ 10 వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయమే సీబీఎస్‌ఈ 12 విడుదల కాగా కొద్దిసేపటి క్రితమే 10 వ తరగతి ఫలితాలు కూడా విడుదల చేసింది సీబీఎస్‌ఈ బోర్డు. ఈ లింక్ ద్వారా తమ ఫలితాలను cbseresults.nic.in ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా 10 తరగతి క్లాసులు గత విద్యాసంవత్సరంలో 3నెలలు మాత్రమే ప్రత్యక్షపద్దతిలో (ఆఫ్-లైన్) జరిగాయి. ఎక్కువగా ఆన్-లైన్ తరగతులే జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బోర్డు పరీక్షలు పూర్తై ఫలితాలు వచ్చినా సీబీఎస్ఈ ఫలితాలు ఇప్పటి వరకు రాకపోవడం వల్ల ఇంటర్ అడ్మిషన్ల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగరాలలో ఫలితాలు రాకపోయినా ఇప్పటికే చాలామంది జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పొందారు.