ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఉపశమనం లభించింది. రెండోసారి సస్పెండ్ చేయడాన్ని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ తప్పుబట్టింది. వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. టీడీపీ సర్కారు హయాంలో ఏబీ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

