జీహెచ్ఎంసీ మేయర్ పై కేసు నమోదు
బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్దంగా డీజే ఏర్పాటుతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా డీజే సౌండ్ వాడటంపై జీహె చ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ నెల 10న బంజారాహిల్స్ ఎన్ బి టి నగర్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేసి రాత్రి 11.40 గంటల తర్వాత కూడా దాన్ని కొనసాగించడంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. విజయలక్ష్మి అక్కడికి చేరుకుని పోలీసులు జోక్యం చేసుకోవద్దని సూచించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్ కుమార్, మహ్మద్ గౌస్, విజయలక్ష్మి పై బంజారా హిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

