NationalNews

యోగాతో ప్రశాంతంగా జీవించవచ్చు-మోదీ

Share with

యోగా జీవితంలో భాగమేకాదని… జీవనమార్గమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటక మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగాతో సమస్యలు పరిష్కారమవుతాయని… మనసుకు శాంతి లభిస్తుందన్నారు. యోగా వ్యక్తులకు శాంతిని కలిగించడమే కాదు.. మన సమాజాన్ని సంరక్షిస్తుందన్నారు. భారతీయ యోగా విశ్వ శాంతికి దోహదపడుతుందన్నారు. ఎంత ఒత్తిడితో ఉన్నా… కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే… రిలాక్స్ చేస్తోందన్నారు. పని సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. యోగాను అదనపు పనిగా పరిగణించకుండా… యోగాతో జీవించాలని… యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు ప్రధాని.

2015 నుంచి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం థీమ్ “యోగా ఫర్ హ్యుమానిటీ”గా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా 75 మంది కేంద్ర మంత్రులు 75 ప్రదేశాలలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై పాల్గొన్నారు.