భారత కొత్త రాష్ట్రపతి ఎవరు..? నేడే ప్రకటన
రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఇవాళ తేలనుంది. అభ్యర్థి ఎంపికపై గత కొంతకాలంగా తర్జనభర్జన పడుతున్న బీజేపీ ఇందుకు సంబంధించి క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థి పేరు ఖరారు కానుంది. ఇవాళ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరన్నదాని తేలనుంది. యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై ఇప్పటికే ఐదు రోజులు పూర్తయ్యింది. అభ్యర్థి విషయంలో సయోధ్య కదరకపోవడం… ఎవరిని పోటీ చేయమన్నా… వెనుకంజ వేయడంతో… విపక్షాలన్నీ గందరగోళంలో ఉన్నాయ్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం తర్వాతే పేర్లను బయటకు చెప్పాలని ఎన్డీయే పక్షాలు భావిస్తున్నాయ్. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు అభ్యర్థి ఖరారు విషయంలో విపక్షాలు కిందా.. మీద అవుతున్నాయ్. అభ్యర్థి ఎవరన్నది తేల్చేందుకు సాయంత్రం 5 గంటలకు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో విపక్షాలు భేటీ కానున్నాయ్.