NationalNews

2030 నాటికి సైన్యంలో 50 శాతం అగ్నివీరులే

Share with

అగ్నిపథ్ ద్వారా సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం… ఇప్పుడు అగ్నివీరుల ఎంపిక బాధ్యతలను త్రివిధదళాలపై ఉంచింది. ఇప్పటికే జోరుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుకాగా… వచ్చే రోజుల్లో అగ్నివీరులకు సంబంధించి నియామక ప్రక్రియ ఎలా ఉండబోతుందన్నదానిపైనా ఆర్మీ క్లారిటీ ఇస్తోంది. 2030 నాటికి సైన్యంలో 50 శాతం మంది అగ్నివీరులే సేవలందిస్తారన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన అగ్నిపథ్ రిక్రూట్మెంట్‌కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

అగ్నివీరులకు అనేక విధాలుగా ప్రోత్సాహమందిస్తామంటూ కేంద్రంకతోపాటు, పారిశ్రామికవేత్తలు చెబుతున్నా… దేశమంతటా ఆందోళనలు రేగాయ్. ఐతే అగ్నిపథ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించే ముందు మంచి, చెడులు అన్నీ ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకున్నామన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత. పథకాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. అగ్నిపథ్ వల్ల కలిగే లాభాలు చెప్పడం వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు తగ్గాయన్నారు. రోజులు గడిచేకొద్దీ… పథకం గురించి ప్రజలు, యువత పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు జనరల్ రాణా ప్రతాప్ కలిత. కాలానికి అనుగుణంగా సాయుధ దళాలను ఆధునీకరిస్తున్నామన్న ఆయన… అగ్నిపథ్ ద్వారా మానవవనరుల వినియోగం జరుగుతుందని… సైనికులకు అందే అన్ని బినిఫిట్స్ అగ్నివీరులకు లభిస్తాయని… అదే సమయంలో… సాయుధ దళాల బడ్జెట్‌ తగ్గించేందుకు వీలుకలుగుతుందన్నారు.