NewsTelangana

ఓరుగల్లుకు కాకతీయ వంశ వారసుడు

Share with

కాకతీయులు అనగానే మనకు ముందుగా ఓరుగల్లు గుర్తుకొస్తుంది. కాకతీయులు నిర్మించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి రామప్ప దేవాలయం, జైన్ క్షేత్రం, దామోరా వాయి గుహలు, వరంగల్ ఫోర్ట్, కోటగుళ్లు, మెట్ల బావులు ఇలా చాలా చాలా ఉన్నాయి. కాకతీయ కట్టడాల గురించి చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహాన ఉంది. వీటి మీద ఇంతక ముందు ఎందరో పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నించారు. వారి పరిశోధలలో ఎన్నో కట్టడాలకు పూర్వ వైభవాన్ని… మరికొన్ని కట్టడాలను సందర్శక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. ఐనా వీటి గురించి ప్రజల్లో అవగాహన తక్కువే. ప్రస్తుతం వరంగల్‌లో ప్రారంభమైన కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని తెలంగాణ టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకతీయ వారసుడు మహారాజ కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ హాజరయ్యారు. భద్రకాళి ఆలయ ద్వారం నుండి డప్పు, డోలు, పేరిణి నృత్య కాళకారుల మధ్య కొందరు మంత్రులు కమల్‌చంద్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎడురోజుల పాటు సంస్కృతిక పోటీలు, నృత్య ప్రదర్శనలు ,వ్యసరచన పోటీలు నిర్వహించనున్నారు.