పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో సారయ్యను అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో లక్ష్మి కండిషనల్ బెయిల్‌పై ఉంది. సంతకం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా దాడి జరిగింది. లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీరామ్ పరారీలో ఉన్నాడు.

