Home Page SliderInternationalSports

18ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్.. రూ. 5 కోట్ల నజరానా..

కేవలం 18 ఏళ్ల 8 నెలల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా విజయం సాధించాడు గుకేశ్ దొమ్మరాజు. తమ రాష్ట్రానికి చెందిన యువ ఛాంపియన్ గుకేశ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 5 కోట్ల రివార్డు ప్రకటించారు. వరల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 7.5 పాయింట్లతో విజయం సాధించారు గుకేశ్. 13 రౌండ్ల వరకూ సమంగా నిలిచినా, చివరి రౌండ్‌లో అద్భుత విజయం సాధించాడు గుకేశ్.  విశ్వనాథ్ ఆనంద్ తర్వాత విశ్వవిజేతగా భారతీయ పతాకాన్ని ఎగురవేశాడు. 40 ఏళ్ల క్రితం కాస్పరోవ్ నమోదు చేసిన రికార్డును తిరగరాశాడు. అప్పుడు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించిన కాస్పరోవ్ వయసు 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు కాగా 18 ఏళ్లకే ఈ ఘనత సాధించారు.  ప్రపంచంలోనే ఇంత వరకూ ఇంత చిన్న వయసులో ఈ రికార్డు సాధించిన వారెవరూ లేరు. ప్రపంచ విజేతగా తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న కాస్పరోవ్ రికార్డు బద్దలు కొట్టడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు గుకేశ్. 4 ఏళ్ల వయసులోనే చెస్ బాట పట్టిన గుకేశ్ అండర్-13 విభాగంలో విశ్వనాథ్ ఆనంద్ చేతులమీదుగా ఛాంపియన్ ట్రోపీని అందుకున్నారు. ఈ ఫోటోను ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆనంద్ షేర్ చేస్తూ ‘ఇప్పుడీ పిల్లాడే కింగ్’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.