డ్రైవర్‌కు బీపీ డౌన్..బోల్తా పడిన బస్సు
డ్రైవర్‌కు బీపీ డౌన్ అవడంతో బస్సు బోల్తా పడిన ఘటన తిరుపతి జిల్లా వడమాల పేటలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే మనిషి జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతందో తెలియదు అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమనే చెప్పాలి.

