Home Page SliderTelangana

మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటే: మల్లికార్జున్ ఖర్గే

సికింద్రాబాద్: మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ సనత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. పేదల ఖాతాల్లో మోడీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వెయ్యలేదు? రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ చెప్పారు.. చెయ్యలేదు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు.. ఇవ్వలేదు? బీహెచ్‌ఇఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్‌ హయాంలో వచ్చాయి. కాంగ్రెస్ తెచ్చిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోంది. కేసీఆర్, మోడీ.. పేదలను మరింత పేదలుగా మారుస్తున్నారు. ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నారు అని ఖర్గే విమర్శించారు.