Home Page SliderNational

ఢిల్లీ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు.. దారి మళ్లింపు

భారత విమానాలకు బెదిరింపులు అసలు ఆగడమే లేదు. తాజాగా.. ఢిల్లీ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు దారి మళ్లించారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే పదుల సంఖ్యలో విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అలర్ట్ అయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు.