జానీ మాస్టర్‌కు బాలీవుడ్ ఛాన్స్..
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక ఆరోపణల కారణంగా జైలుశిక్ష పడి, బెయిల్‌పై ఉన్న జానీ మాస్టర్‌కు మళ్లీ సినిమా ఛాన్స్‌లు వస్తాయా అనేది అనుమానంగా మారింది. కానీ టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని పెద్దల మాట. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘బేబీ జాన్’లో స్పెషల్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ వచ్చిందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తేరి’ అనే సినిమాకు ఈ చిత్రం రీమేక్‌గా రూపొందుతోంది.

