కృష్ణా నదిలో తండ్రి అస్తికలు నిమజ్జనం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన తండ్రి దివంగత నలమాద పురుషోత్తం రెడ్డి అస్తికలను శుక్రవారం రోజున కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవలే దివంగతులైన విషయం తెలిసిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం మట్టపల్లి లోని అత్యంత పురాతనమైన శ్రీశ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సన్నిధి గుండా ప్రవహిస్తున్న కృష్ణా నది సంగమంలో అపరాండం వేళా శాస్త్ర యుక్తంగా నిమజ్జనం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ఆయన సోదరులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.