రూ. కోటి విలువ చేసే మరబోటు సముద్రంలో మునక
అరేబియా మహా సముద్రంలో మరబోటు ప్రమాదానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. మంగుళూరు దగ్గర అలల ఉధ్రృతికి మరబోటుకు రంధ్రం పడినట్లు గురుర్తించిన మత్య్సకారులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బోటులో ఉన్న 11 మంది మత్య్సకారులను కాపాడారు. రూ. కోటి విలువ చేసే మరబోటు సముద్రంలో మునిగిపోగా.. బోటులో ఉన్న అందరూ సురక్షితంగా బయట పడటంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
మత్య్సకారులంతా అదినారాయణపురం , తుమ్మలపెంట , పెదరాముడు పాలెం , అల్లూరుకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. భారీగా వీస్తున్న గాలుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
Read more: చైనాలో లేవి వైరస్ కలకలం