NationalNews

గంగూలీ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌…

Share with

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓడి గోల్డ్‌ మెడల్‌ను తృటిలో చేజార్చుకుంది. దీంతో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్‌ టీం ప్రదర్శనకు దేశ నలుమూలల నుండి అభిమానులు అభినందించారు.

అయితే… బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ భారత మహిళల జట్టును అభినందిస్తూనే.. ఇంకో ప్రక్క చురకలంటించే కామెంట్‌ చేశారు. “సిల్వర్‌ గెలిచినందుకు భారత మహిళా క్రికెట్‌ జట్టుకు అభినందనలు… అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్‌ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యం కాని ట్వీట్‌ చేశారు. ఈ అభ్యంతరకర ట్వీట్‌ ఇప్పుడు నెట్‌ ప్రపంచంలో హల్‌చల్‌ చేస్తోంది.. అయితే ఫ్యాన్స్‌ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను భారత జట్టును మనస్ఫూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా కామెంట్‌ చేస్తావా అంటూ సీరియస్‌ అవుతున్నారు. అసలు మీ ట్వీట్అం‌దరికీ బాధ పెట్టే విధంగా ఉందంటూ మండిపడుతున్నారు. మరో వైపు భారత మహిళా క్రికెట్‌ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహారుద్దీన్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.