Home Page SliderTelangana

బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.500లకే సిలిండర్

Share with

తెలంగాణాలో హ్యాట్రిక్ సీఎంగా కొనసాగేందుకు కేసీఆర్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయతే ఈ మ్యానిఫెస్టోలో మహిళలు,యువత,రైతులే ఎజెండాగా ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ఈ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా వంట గ్యాస్  సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణాలోని యువత ఉద్యోగాలకు ఉచితంగా ప్రిపేర్ అయ్యేలా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణాలో రైతుల కోసం ఫించన్లు,ఉచిత ఎరువుల హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. మరి కేసీఆర్ మ్యానిఫెస్టో హామీలు ఆయనను మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించేలా చేస్తాయో లేదో వేచి చూడాలి.