NewsTelangana

కేసీఆర్ కోసం ఇంత దిగజారుతారా..

Share with

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్ఐసీసీలో తెలంగాణ పోలీసులు కలకలం రేపారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు… తీర్మానాల కాపీని ఫోటో తీయడాన్ని గుర్తించామన్నారు బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి. బీజేపీ సమావేశాలపై ఎందుకంత అక్కసు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడుతనానికి తాజా ఘటన నిదర్శనమన్నారు ఇంద్రసేన. నిఘా అధికారులు పోలీసు పాసులతో ప్రవేశించారని… తీర్మానాల కాపీలను ఫోటోలు తీశారన్నారు. సదరు అధికారులను గుర్తించి పోలీస్ కమిషనర్‌కు అప్పగించామని… ఫోటోలు డిలీట్ చేయించామని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.