NationalNews

సెమీ‌ఫైనల్స్‌లో ఎక్‌నాథ్ సూపర్ విక్టరీ

Share with

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో బలనిరూపణకు ముందు శివసేన రెబల్ నాయకుడు, ముఖ్యమంత్రి ఎక్ నాథ్ షిండేకు సానుకూల పరిణామాలు కన్పిస్తున్నాయ్. అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రంలో తాజా పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నిక కీలకమయ్యింది. స్పీకర్ కు అనుకూలంగా 165 ఓట్లు పోలయ్యాయి. శివసేన బలపర్చిన అభ్యర్థికి 107 ఓట్లు లభించాయ్. 45 ఏళ్ల నార్వేకర్ ముంబైలోని కొలాబా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశాడు. నార్వేకర్ మహారాష్ట్ర శాసనమండలి చైర్మన్ NCP నేత రాంరాజే నాయక్-నింబాల్కర్ అల్లుడు. 2014లో పార్టీని వీడకముందు శివసేన యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. శివసేన తర్వాత శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం ఉన్నారు. రాహుల్ నార్వేకర్ 2014 లోక్ సభ ఎన్నికల్లో మావల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శివసేనకు చెందిన శ్రీరంగ్ అప్ప బర్నే చేతిలో ఓడిపోయాడు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నార్వేకర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన అశోక్ జగ్తాప్‌పై ఆయన కొలాబా నుంచి విజయం సాధించారు.