Home Page SliderTelangana

ఐటీ రైడ్స్‌కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు

హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలన తడిబట్టలతో గొంతుకలు కోసే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ప్రజలపై కంటే మాఫియాపైనే ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ ఆఫీస్‌లో బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థులందరికీ బీ-ఫారాలను అందజేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దీపావళి పండగ అయిన తర్వాత వెంటనే బీజేపీ ప్రచారాన్ని పరుగులెత్తిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఆదాయ పన్నులు సరిగ్గా కట్టకపోతే ఐటీ దాడులు జరగడం అనేది కామన్ థింగ్. దానికి బీజేపీ పార్టీకి ముడిపెట్టవద్దన్నారు.