Home Page SliderNational

లేగదూడను అక్కున చేర్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

Share with

ప్రతి రోజూ అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేటి శనివారం ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. కొత్త సభ్యుడిని పరిచయం చేశారు. ప్రధాన మంత్రి ఫ్యామిలీలోకి ఓ కొత్త సభ్యుడు వచ్చారంటూ పేర్కొన్నారు. అయితే, ఆ కొత్త వ్యక్తి మరెవరో కాదు.. చిన్ని ఆవు దూడ. ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన ఇంట్లో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు మోదీ పేరు కూడా పెట్టారు. దూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన ముద్రతో ఉన్న గుర్తు ఉంది. ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకుని దానికి ప్రధాని మోదీ ‘దీప్‌జ్యోతి’  అని పేరుపెట్టారు. తన ఇంట్లో ఉండే లేగదూడకు శాలువా కప్పి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఫొటోలో లేగదూడను ముద్దాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఫొటోలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.