మ్యాచ్ వేదికలపై బీసీసీఐ కీలక నిర్ణయం
భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన టీ 20 మ్యాచ్ లక్నోలోని పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీనితో బీసీసీఐ పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కాలంలో మంచు ఉంటుందని తెలిసి, ఇలా మ్యాచ్ పెట్టడం ఎందుకని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో కూడా మంచు వల్ల ఆటకు కష్టమయ్యింది. దీనితో మ్యాచ్ జరిగే వేదికలపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పలు అంతర్జాతీయ మ్యాచ్ ల వేదికలను మంచుకురిసే ఈ కాలంలో ఉత్తరాదిలో రద్దు చేయాలని నిర్ణయించింది. దేశవాళీ టోర్నీలు కూడా ఉత్తరాది నుండి దక్షిణాదికి మార్చాలని ఆలోచిస్తోంది. జైపూర్ వేదికగా జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుండి జనవరి 18 వరకూ ఉంది. అలాగే భారత్ -న్యూజిలాండ్ వన్డే సిరీస్ కూడా జనవరి 11 నుండి వదోదర, రాజ్ కోట్, ఇండోర్ లలో జరగనుంది. వీటన్నింటినీ దక్షిణాది నగరాలకు తరలించే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. ఇక భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదో టీ 20 మ్యాచ్ మాత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనే జరుగుతుంది.

