Home Page SliderInternational

ఇండియాలో రాయబారిని రీకాల్ చేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దౌత్యపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా రాయబారితో సహా ఐదుగురు రాయబారులను వెనక్కి పిలిపించింది. నోబెల్ శాంతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తాజా నిర్ణయం సంచలనంగా మారింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రస్సెల్స్, కాన్‌బెర్రా, లిస్బన్, న్యూ ఢిల్లీ, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి శాశ్వత మిషన్‌ రాయబారులను వెంటనే రాజధాని ఢాకాకు తిరిగి రావాలని ఆదేశించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిటన్‌లోని హైకమిషనర్ సైదా మునా తస్నీమ్‌ను రీకాల్ చేసిన తర్వాత, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.