విజయ్ దేవరకొండకు బండ్ల గణేష్ కౌంటర్
బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వరికి అర్ధం కాదు కానీ ఆయన మాట్లాడినా… ట్వీట్ చేసిన సంచలనమవుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశాడు.’తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్’ అంటూ ట్వీట్ చేశాడు. ఐతే బండ్ల గణేష్ ట్వీట్… విజయ దేవరకొండను ఉద్దేశించేనంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
నిన్న జరిగిన లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకోండ మాట్లాడుతూ…’మీకు మా అయ్య ఎవరో తెలవదు…మా తాత ఎవరో తెలవదు… రెండ్లేళ్లవుతోంది సినిమా రిలీజై… ఆ ముందు రిలిజైన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు..అయిన ట్రైలర్ కి ఈ రచ్చ ఎందిరా నాయనా’ అంటూ విజయ్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. అయితే విజయ్ టాలీవుడ్‌లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. విజయ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గానే బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు అని అంతా అనుకుంటున్నారు.