కొనసాగుతున్న బండి సంజయ్ నిరసన దీక్ష
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది. కరీంనగర్లోని తన నివాసం వద్ద బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. మరోవైపు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ముఖ్య నేతలు నిరసన దీక్షకు దిగారు. డా. లక్ష్మణ్తోపాటు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జీవితా రాజశేఖర్ నిరసనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్భంధాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.

