ప్రతి మాటకి జోష్ మీద లేస్తావ్.. కూర్చోకపోతే సస్పండ్ చేస్తా..
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చాలా సీరియస్ అయ్యారు. ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి నిలబడి ఉండడంతో కూర్చోకపోతే సస్పెండ్ చేస్తానని స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. సస్పెండ్ చేయండంటూ కౌశిక్ రెడ్డి ప్రతిస్పందించారు. కొత్తగా శాసన సభ్యులకు ఇలాంటి సంప్రదాయం, ప్రవర్తన సరికాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హితవు పలికారు.

