Home Page SliderTelangana

నోటీసులకు భయపడేది లేదు: బీజేపీపై పోరాడుతున్నందుకే ఇలా: సీఎం రేవంత్

Share with

ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నోటీసులకు తాను భయపడేదిలేదన్నారు. బీజేపీపై పోరాడే వారికి నోటీసులిస్తున్నారన్నారు. విపక్షాలపై మోదీ సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, కర్నాటకలో బీజేపీని ఓడించితీరతామన్నారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ వచ్చి అమిత్ షా ఫేక్ వీడియోలపై నోటీసులిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డితోసహా, కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమ్‌కు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 91 కింద నోటీసులిచ్చారు. మే1న విచారణకు హాజరుకావాలని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో వీడియో పోస్ట్ చేసిన గాడ్జెట్ కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. వీడియో రికార్డ్ చేసిన గాడ్జెట్ కూడా తేవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో కారణంగా, మతసామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉందని, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.