Andhra PradeshHome Page Slider

కొడాలి నాని అనుచరుల అరెస్టు

మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులను గుడివాడ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ యువ నేతలు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2022 డిసెంబర్ 25న వీరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. ఈ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇవాళ అరెస్టు చేశారు. అనంతరం వారిని పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో నిందితుడు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు.