Andhra PradeshHome Page SliderPolitics

2024లో జగన్‌, మంత్రి ధర్మాన అజెండాలు ఒకటేనా?

2024కి ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అజెండా ఏమిటో చెప్పాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే 2024 నాటికి రెండు రాష్ట్రాలు లేదా మూడు రాష్ట్రాలు చెయ్యాలనుకుంటున్నారా? అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా..? ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా ధర్మనా అభిప్రాయమా? 2024లో జగన్‌, మంత్రి ధర్మాన అజెండాలు ఒకటేనా? అని విష్ణు ప్రశ్నించారు.

ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మంత్రి కారకుడవుతున్నారు. ధర్మాన అబిప్రాయం అయితే ధర్మానను మంత్రి వర్గం తొలగించాలన్నారు. వైసీపీ మంత్రులు అందూ తీసేసిన తహశీల్దార్‌లా తయారయ్యారు. ఏపీలో ఏకీకృతమైన అవినీతి జరుగుతుంది. వైసీపీ పోవాలి… బీజేపీ రావాలి. అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుందని విష్ణువర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 23, 24 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కి అవమానం చేయలేదా..? ప్రధాన తల్లిని విమర్శించలేదా..? అమిత్ షాపై రాళ్ల దాడి చేయించలేదా..? అధికారం కోల్పోయిన తర్వాత మోదీ చుట్టూ తిరుగుతున్నారని విష్ణువర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.