ప్రజల సొమ్ముతో రుషికొండలో జగన్ విలాస భవనం
ఏపీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్. వైసీపీ ప్రభుత్వ కార్యకలాపాలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రరాష్ట్రంలో 89 లక్షల కార్డ్‌లకు ఉచిత రేషన్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం MHFS కార్డులను తగ్గించుకుంటూ పోతోందన్నారు. హెల్త్ కార్డ్స్ చాలా మందికే అందడం లేదు. ఒక్క వైసీపీ మద్దతుదారులకు మాత్రమే రేషన్ బియ్యం అందుతున్నాయన్నారు. మరో నాలుగు నెలల్లో తన పదవీకాలం పూర్తవబోతోందని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, వాటిలో కలిసిన కొత్త జిల్లాలకు సంయుక్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ త్వరలో నోటిఫికేషన్ రాబోతోందని సరైన ఎమ్మెల్సీని ఎన్నుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు నిధులు లేవు అంటోందని… కానీ రుషికొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాస భవనం నిర్మించే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ అధికార భవనాన్ని తలదన్నే అతి పెద్ద భవనం నిర్మిస్తున్నారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద అరాచకం ఈ రుషికొండే అన్నారు. ఈ భవన నిర్మాణానికి 165 కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఇక్కడ పథకాలకు ఖర్చు పెడుతున్నారన్నారు. వైసీపీ , టీడీపీ పార్టీలు కుటుంబపాలనకు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని, వచ్చిన పరిశ్రమలు ఎన్నో లెక్క చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. నిధులు లేవంటూ జగన్‌కు మాత్రం కోట్లరూపాయలు ఎక్కడనుండి తెస్తున్నారన్నారు.