’17 వేల జగనన్న కాలనీలు’ రాబోతున్నాయి…జగన్
పేదల సొంతఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. నేడు సామర్లకోటలో జగనన్న కాలనీని ప్రారంభించారు జగన్. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. 17 వేల వైఎస్సార్ కాలనీలు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. ఇవి ఇళ్లు కాదు ఊర్లే అంటూ తెలియజేశారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం అతి వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలో ఇళ్లు పూర్తయ్యాయని, టిడ్కోఇళ్లు కూడా పూర్తవుతున్నాయని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఉండాల్సిందేనన్నారు. అదే లేఅవుట్‌లో 12 లక్షలు గల ఇంటి స్థలం ఉంటుందని, దీనితో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నామని అంటున్నారు జగన్. నవరత్నాలలోని ప్రతీ పథకం ప్రజలపై ప్రేమ,బాధ్యతతోనే అడుగులు వేస్తున్నానని తెలియజేశారు. ఇదే సందర్భంలో చంద్రబాబుపై విరుచుకు పడ్డారు జగన్. చివరికి తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. నేడు 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. పేదలకు తాను ఇళ్లు ఇస్తుంటే, కోర్టుకెళ్లి చంద్రబాబు అడ్డుపడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఇళ్లు పక్కరాష్ట్రమైన హైదరాబాద్‌లో ఉందని, తన నియోజక వర్గమైన కుప్పంలో మాత్రం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా తన ప్రభుత్వాన్ని, గతంలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని పోల్చి చూడమన్నారు. గతంలో ఆయన కనీసం ఒక్క నెలరోజులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడం లేదని, ఇప్పుడు మాత్రం నెలగా రాజమండ్రిలో కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన బావమరిది, ఆయన దత్తపుత్రుడు, ఈనాడు రామోజీరావు ఉండడని వారంతా హైదరాబాద్‌లోనే కనిపిస్తారని ఎద్దేవా చేశారు.

ఇక దత్తపుత్రుడు పవన్ సంగతి మీకు తెలిసిందేనన్నారు. ఆయన ఇళ్లు హైదరాబాద్‌లో అయితే ఆయన ఇల్లాల్లు మాత్రం ప్రతీ మూడు నాలుగేళ్లుకు మారిపోతుంటారని నవ్వుకున్నారు. మహిళలన్నా, పెళ్లిపై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో తెలుసుకోవాలన్నారు. ఇలాంటి పాలకులు మనకవసరమా అని ప్రశ్నించారు. ఈ ప్యాకేజీ స్టార్‌కు మన రాష్ట్రంతో కూడా ఎలాంటి అనుబంధం లేదన్నారు. ఆయన పోటీ చేసిన భీమవరం, గాజువాక ప్రాంతాలపై ఎలాంటి అభిమానం లేదని ‘యూజ్ అండ్ త్రో’ గా భావిస్తున్నాడని, తన అభిమానుల ఓట్లను, సొంత పార్టీని, వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వారిని ఇతడినే చూస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి విలువలు లేని వ్యక్తులను నమ్మవద్దన్నారు. మన రాష్ట్రంపై ప్రేమలేని వారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారన్నారు. అధికారం చంద్రబాబుకు లేకపోతే అందరికీ ఫ్యూజులు, ఆదాయాలు పోయాయన్నారు. మన మట్టితో కానీ, మన రాష్ట్రంతో కానీ ఎలాంటి అనుబంధం లేదు. వీరు కేవలం వ్యాపారం కోసమే ప్రేమ ఒలకపోస్తున్నారని మండిపడ్డారు.