Home Page SliderInternational

అమెరికాలో త్వరలోనే బ్యాన్ కానున్న యాపిల్ స్మార్ట్ వాచ్‌లు

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో యాపిల్ నుంచి వచ్చే ఏ వస్తువుకైనా జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది.  ఈ క్రమంలో ఇటీవల యాపిల్ నుంచి వచ్చిన  స్మార్ట్ వాచ్‌లు కూడా బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లపై అమెరికా త్వరలోనే నిషేదం విధించనుంది. కాగా ఈ నెల 25 నుంచే ఈ నిషేదం అమలు లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ తాజాగా ప్రకటించింది. యాపిల్ స్మార్ట్ వాచ్‌లలో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ లెక్కించే ఫీచర్‌కు మాసిమో కార్ప్ అనే సంస్థ పేరు పేటెంట్‌గా ఉంది. దీని కారణంగానే అమెరికాలో యాపిల్ వాచ్‌లపై నిషేదం అమలు కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25 లోగా అల్గారిథమ్స్‌లో మార్పులు చేసి బ్యాన్ నుంచి బయటపడాలని యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.