జుక్కల్ వినాయక నిమజ్జనంలో అపశృతి
నిజామాబాద్ జిల్లా జుక్కల్ వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకు వెళ్ళే క్రమంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకు వెళుతుండగా విద్యుత్ ఘాతానికి గురై పడంపల్లి రాజు అనే యువకుడు మృతి చెందాడు. దీంతో నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వినాయక నిమజ్జనంలో ఇటువంటి ప్రమాదం జరగడం అందరినీ తీవ్రంగా కలిచి వేసింది.

