ఏపీలో నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు. 22 రోజులు వ్యవధిలోనే ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించనుంది. ఈ విడత ఇంటర్ ప్రథమా ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఒకేసారి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిస్తారు. మార్చి 15న ఇంటర్ ప్రథమ సంవత్సరం 16న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షల ప్రక్రియ ఏప్రిల్ 4 తో ముగిసింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్‌సైట్లో సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.

