ఏపీకి మరో ప్రమాదం..
ఇది సెప్టెంబరు 5 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీనితో రాబోయే మరో మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో కోస్తాలో సెప్టెంబర్ 2,3 తేదీలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 4 వతేదీ నుండి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా బలమైన ఉపరితల గాలుల కారణంగా మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

