Home Page SliderInternational

పారిస్ ఒలింపిక్స్‌లో మరో బులెట్-స్వప్నిల్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో కాంస్యం చిక్కింది. భారత్ షూటర్ స్వప్నిల్ కుశాలె తన బులెట్‌లో ఒలింపిక్స్‌లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్‌లో విజయం సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ప్రారంభించి నాలుగు, ఐదు స్థానాలలో కొనసాగిన స్వప్నిల్ టాప్ 3కి వచ్చాక దూకుడుగా షూటింగ్ కొనసాగించి 451.4 పాయింట్లను సాధించి కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ పోటీలో చైనా షూటర్ 463.6 పాయింట్లతో స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ 461 పాయింట్లతో రజతం గెలుచుకున్నారు. ఈ పోటీలలో మూడు పొజిషన్లలో షూట్ చేయాల్సి ఉంటుంది. స్టాడింగ్, నీలింగ్(మోకాళ్ల మీద), ప్రోన్(బోర్లా) భంగిమలలో మొత్తం 451.4 పాయింట్లు సాధించాడు. దీనితో కలిపి భారత్‌కు ఇప్పటివరకూ 3 కాంస్య పతకాలు వచ్చినట్లయ్యింది. ఈ మూడూ షూటింగ్‌లోనే కావడం విశేషం.