Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీకీ మరో భారీ షాక్

 ఇటీవల కాలంలో తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కాగా ఈ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కనకయ్యతోపాటు ఆయన అనుచరులు,ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా పలువురు నాయకులు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 56మంది సర్పంచ్‌లు,26మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే వీరంతా రేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రేపు ఖమ్మంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోనే వీరంతా కారును వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.