చేతనైతే కేసీఆర్‌ను ఢీకొట్టు రేవంత్-ఈటల హితవు
మునుగోడు ఉపఎన్నికల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పార్రాటీ యంత్రాంగాన్నంతా మునుగోడులో మొహరిస్తామన్నారు. హుజురాబాద్‌లో ఆడిన నాటకలు మునుగోడులో సాగనివ్వమని హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి… బీజేపీలోకి చేరినందుకు మునుగోడు ప్రజలందరూ..సంబరపడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఉపఎన్నికలు వస్తే సమస్యలు తీరుతాయని భావిస్తున్నానన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక వ్యక్తుల మధ్య కాకుండా సీఎం కేసీఆర్ అహంకారానికి ,ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందన్నారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని, పార్టీలు వేరైనప్పటికీ … తెలంగాణ ఉద్యమంలో అన్యాయంపై పోరాడారని తెలిపారు. అటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డిలాగా తాను దిగజారి మాట్లాడనని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేయడంతోనే… రేవంత్ రెడ్డి ఆయనపై చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఆయనకు గౌరవం దక్కదన్నారు. రేవంత్ రెడ్డి ముందు బీజేపీని తిట్టడం మానేసి వెళ్ళి కేసీఆర్‌తో కొట్లాడాలన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని సమర్ధవంతంగా పరిపాలిస్తున్నారు కాబట్టే.. ఇతర పార్టీల నేతలందరూ..బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు ఈటల.