Home Page SliderNationalSports

కేన్‌ను  IPL కు దూరం చేసిన గాయం

IPL 2023 నిన్న అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ గుజరాత్ టైటన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరిగింది. కాగా మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ జట్టులోని స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ సీజన్ IPL మొత్తానికి దూరమైయ్యేటట్లు తెలుస్తోంది. కాగా నిన్న బౌండరీని ఆపే క్రమంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. అయితే ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మిగిలిన మ్యాచ్‌లు కేన్ ఆడ లేడని Sports Tak పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ క్రమంలో కేన్ మామ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.