NationalNews

శ్రద్ధవాలా తరహాలో మరో ఘాతుకానికి యత్నం…

పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో తన 35 ఏళ్ల భాగస్వామి రేఖారాణిని కత్తితో పొడిచి చంపాడో దుర్మార్గుడు. అంతే కాదు ఆమెను ముక్కులు ముక్కలుగా నిరికేయాలని కూడా పథకం వేసుకున్నాడు. ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ వ్యవహారం మరచిపోక ముందే ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆఫ్తాబ్ పూనావాలా నుండి ప్రేరణ పొంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే తరహా మహిళను అంతం చేసి, కిరాతకంగా వ్యవహరించాలనుకున్న మన్‌ప్రీత్‌ను
పోలీసులు పంజాబ్‌లో అరెస్టు చేశారు. రేఖా రాణి శరీరంపై దవడపై కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. 16 ఏళ్ల కుమార్తెతో గణేష్ నగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అప్పటికే పెళ్లై… ఇద్దరు పిల్లలతో ఉన్న మన్‌ప్రీత్ 2015లో రేఖతో సంబంధాన్ని ప్రారంభించాడు. గణేష్ నగర్‌లో ఆమెతో కలిసి సహజీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలించుకోవాలని చూశాడు. భాగస్వామిని చంపాలని ప్లాన్ చేసాడని పోలీసుల విచారణలో తేలింది. డిసెంబర్ 1వ తేదీ రాత్రి మైనర్ కుమార్తెకు నిద్రమాత్రలు వేసి, నిద్రపోయిన తర్వాత రేఖను కత్తితో నరికి చంపాడు. రేఖ మృతదేహాన్ని నరికి చంపేందుకు కత్తిని కొన్నాడని, అయితే ఆమె కూతురు గుర్తుపడుతుందేమోనని భయపడ్డారని చెప్పారు. మన్‌ప్రీత్ పలు కిడ్నాప్, హత్య కేసుల్లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రేఖ కుమార్తె ఫిర్యాదుతో ఐపీసీ 302 హత్య, 201 నేరం సాక్ష్యం అదృశ్యం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.