NewsNews AlertTelangana

TRS కి టాటా చెప్పేస్తున్నా-రాజయ్యయాదవ్

Share with

కన్నబోయిన రాజయ్యయాదవ్ ఈరోజు ప్రెస్‌తో మాట్లాడుతూ కొన్నేళ్లుగా తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను వెల్లగక్కారు. తాను 22 ఏళ్లుగా తెలంగాణా రాష్ట్ర సమితితో కాపురం చేస్తున్నానని, ఆత్మగౌరవం దెబ్బతింటోందనీ ఇక తాను భరించలేననీ విడాకులు కావాలనీ, బాధతోనే విడిపోతున్నాననీ చెప్పారు. తనను మెదక్ పార్లమెంటుకు పంపుతాననీ మాట ఇచ్చి, ఒక సినీ నటి సోదరిని పంపారనీ, మళ్లీ రాజ్యసభకు కూడా పంపుతాననీ మాట ఇచ్చి తప్పారనీ, బహుశా తాను ఈడు జోడు కాలేదేమో అనీ చమత్కరించారు. తానకు ఏ పదవీ రాలేదని ఏనాడూ బాధపడలేదనీ, తెలంగాణా కోసం కేసీఆర్‌తో కలిసి ఉద్య మంలో పని చేసాననీ తెలంగాణా రాష్ట్రం వస్తుందని క్లారిటీ లేకపోయినా పోరాడానన్నారు. సాధించిన తెలంగాణాలో ఉద్యమకారులకు చోటులేదనీ తాను అందుకే వైదొలుగుతున్నాననీ, తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతోనే వెళ్లిపోతున్నాననీ, అన్నా అని పిలిచేవారే ఫోన్‌లు చేసినా మాట్లాడడం లేదనీ, పార్టీకి మంచి పరిస్థితులు ఉన్నా సీనియర్లను గౌరవించే కనీస సంస్కారం పార్టీకి లేదనీ, పెద్ద పదవులలో అందరూ వారి కుటుంబీకులే సర్దుకున్నారనీ అన్నారు. తమ పార్టీ పరాయి వారి చేతిలోకి వెళ్లిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేసారు. గాంధీ తదనంతరం పుస్తకంలో నెహ్రూ గాంధీతో ఉన్నవారినందరినీ తొక్కేసినట్లు ఇప్పుడు కేసీఆరే టీఆరెస్ పార్టీలోని ఉద్యమం లో పని చేసిన వారిని తన కొడుకుని అందలం ఎక్కించడానికి అడ్డంగా ఉన్నవారిని తొక్కేస్తున్నారనీ తెలంగాణా సోదరులందరూ ఈవిషయం గమనించాలనీ సూచించారు. ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందనీ బాధ పడ్డారు. తనను మీటింగులకు పిలిచినా తనతో ఏ సంప్రదింపులూ జరపట్లేదనీ, తాను అర్ధరాత్రి వరకూ ఉంటున్నా కూడా కనీసం గమనించడం లేదనీ బాధపడ్డారు. . తాను ఇంకా ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోలేదనీ చెప్పారు. తనకు బీజేపీ నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయనీ, తాను జనతాపార్టీలోనూ, బీజేపీలో కూడా 2000సంవత్సరానికి ముందు పనిచేసాననీ చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో ఉన్నా తెలంగాణా కోసమే పనిచేస్తాననీ ప్రకటించారు.