అల్లు అర్జున్‌పై అమితాబ్ ప్రశంసల వర్షం
దేశవ్యాప్తంగా పుష్ప -2 హవా నడుస్తోంది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజులకే రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీలోనే రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ముంబైలో మాట్లాడిన అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడారు. ఆయన 8 పదుల వయసులోనూ అద్భుతంగా పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ మాటలు గుర్తు చేస్తూ అమితాబ్ రిప్లయ్ ఇచ్చారు. ‘నన్ను నా అర్హత, స్థాయికి మించి పొగిడేస్తున్నారు అల్లు అర్జున్. మీ ప్రతిభకు మేమంతా అభిమానులం. మీరు ఇలానే ఎప్పుడూ విజయాలు సాధిస్తూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 రెమ్యూనరేషన్ కోసం రూ.300 కోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో ఆయన దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటునిగా గుర్తింపు పొందారు.


