Home Page SliderNational

సిక్కుల హృదయం దేశంతో మిళితమైపోయిందన్న అమిత్ షా

ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి మూడు నెలలకోసారి పంజాబ్ ముఖ్యమంత్రిని కలుస్తానన్న షా… దేశ భద్రత విషయంలో ఆప్ సర్కారుకు అండగా ఉంటానని అమృతపాల్ సింగ్ విషయం గురించి అమిత్ షా వివరించారు. అమృతపాల్ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశామని, పోలీసులు, నిఘా వర్గాలు ఈ కేసుపై కసరత్తు చేస్తున్నారన్నారు.

విదేశాల్లోని భారతీయ మిషన్లపై దాడులపై షా మాట్లాడుతూ, ఇది భారత్‌పై దాడి అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి సిక్కుల సహకారం అపారమైనది.. ప్రతి సిక్కు భారత్‌తో ఉండాలని కోరుకుంటాడన్నారు.

న్యాయవ్యవస్థ, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఘర్షణలు లేవన్నారు హోంమంత్రి. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండూ తమ తమ పరిధిల్లో పనిచేస్తున్నాయని… ఆయన అన్నారు. చట్టాలు చేయడమే ప్రభుత్వ బాధ్యతని… పార్లమెంటు మొత్తం వ్యవహారం గురించి ఆలోచిస్తుందని చెప్పారు.