HealthHome Page SliderTelanganatelangana,

శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్..

కిమ్స్ ఆసుపత్రిలో గత 35 రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ అసుపత్రికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన కిమ్స్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. కిమ్స్‌కు వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులు పంపగా, రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారం అందించి, తగిన బందోబస్తుతో ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారని సంబంధింత వర్గాలు తెలిపారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా వచ్చిన అల్లు అర్జున్‌ను చూడడానికి జరిగిన తొక్కిసలాటలో మహిళ రేవతి మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ వెంటిలేటర్‌పై కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.