‘సోనియా కోసమే ఇదంతా’.. కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండీకి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ అప్పుల్లో మునిగిపోవడానికి సోనియానే కారణమని, అక్కడ అప్పుల సొమ్ములన్నీ సోనియాకే చేరాయని విమర్శించారు. విపత్తుల కారణంగా సంభవించిన నష్టాలకుగాను ఇచ్చిన నిధులన్నీ సోనియా రిలీఫ్ పండ్‌కు చేరాయని ఆరోపించారు. రాష్ట్రం ఈ కారణంగానే అప్పులకుప్పగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ తీసుకున్న అప్పులన్నీ సోనియా కోసమే అన్నారు. అక్కడే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు.

