News

ఆ రాసి వారికి షేర్లలో పట్టిందల్లా బంగారమే

సెప్టెంబర్ 20
మేషం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి లేదా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆశాజనకమైన ఫలితాలు. దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తాయి అపార్ధాలు వద్దు.

వృషభం: మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆలోచనా విధానం వలన సమస్య ఎదురయ్యే అవకాశం. ఈరోజు నూతనమైన పనులు ప్రారంభించక పోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థుల అంచనాలు తప్పవచ్చు. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడం శుభప్రదం.

మిధునం : కొత్త ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. పనులు లేదా వ్యాపారాలలో రాబడి ఉంటుంది. నూతన వ్యక్తులు లేదా సంస్థలు పరిచయం. రియల్ ఎస్టేట్ పనివారికి కలసి వస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్లలో లాభాలు ఉన్నాయి. తలపెట్టిన పనులు కార్యక్రమాలు నేడు ఫలించే అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం : ఈరోజు చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ద్వారా సహాయం అందుతుంది. అప్పులు కోసం ప్రయత్నం. ఆకస్మిక ప్రయాణాలు వలన కొంత శుభం కానీ కష్టం ఎక్కువ. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది . కళాకారులు ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం : ఈరోజు చేసే పనులు మంచి ఫలితాన్నిఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మీ ద్వారా ఇంట బయట మంచి వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. విద్యార్థులు చేసే ప్రయత్నాలు సఫలం. ఈశ్వరారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కన్య: ఈరోజుచాలా శుభప్రదం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మిత్రులతో ప్రయాణం ఉల్లాసాన్ని ఇస్తుంది. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. చేసే పనిలో జాగ్రత్త వహించాలి అపరిచితులను నమ్మవద్దు. నేటి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. నేటి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఆంజనేయుని శ్లోకాలు చదివితే బాగుంటుంది.

తుల : ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో పనులు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయకండి. పారిశ్రామిక వర్గాలకు కలిసి వస్తుంది. కష్ట సమయాల్లో బంధువులు లేదా స్నేహితుల నుంచి సహకారం తక్కువ. శ్రీ రామ నామాన్ని స్మరించాలి.

వృశ్చికం : ఈరోజు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ. పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శారీరక రుగ్మతలు బాధిస్తుంటాయి. మిత్రులు లేదా బంధువులతో తగాదాలు. విద్యార్థులకు విద్యపై దృష్టి ఉంచాలి. మహిళలకు కుటుంబ సహకారం ఈరోజు తక్కువ. హయగ్రీవ స్తోత్రం జపించడం ఉత్తమం.

ధనుస్సు: ఈరోజు వ్యాపారాలకు విద్యార్థులకు ఉత్తమ కాలం. అభివృద్ధి కోసం కాలాన్ని వినియోగించండి. బుద్దిబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ధన రాబడి ఇ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. విలువైన వస్తువుల సేకరణ. శని ధ్యాన శ్లోకం పఠనం శుభప్రదం.

మకరం : ఈరోజు నూతనమైన పనులు ప్రారంభించే అవకాశం. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చికాకులు ఎదురైనా… విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతనమైన అవకాశాలు. మహిళలను శారీరక రుగ్మతలు బాధించే అవకాశం. ఇష్ట దైవారాధన చేస్తే ఫలితం.

కుంభం: ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం. ఉద్యోగలు శ్రద్ధగా పనిచేయాలి. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. కుటుంబంలో చికాకులు. పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య నష్టం వలన వైద్యశాల సందర్శనం. లక్ష్మీ అష్టకాన్ని పఠనం చేయాలి.

మీనం : ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. ప్రయాసలతో పనులు పూర్తవుతాయి. బాధ్యతలు ఎక్కువ ప్రయాణాలు అధికం. అధిక ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా జరపాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ఎం. శ్రీకాంత్ శర్మ

హిందూ ధర్మ చక్రం

98494 85645