“క్రికెటర్లందరూ అన్ని ఫార్మెట్లు ఆడాల్సిందే”:గంభీర్
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. కాగా టీమిండియా క్రికెటర్లందరు అన్ని ఫార్మెట్లు ఆడాల్సిందేనని గంభీర్ తేల్చి చెప్పారు. అయితే T20,వన్డే,టెస్టు మ్యాచ్‌లకు వేర్వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములాపై తనకు నమ్మకం లేదన్నారు. కాగా క్రికెట్ ఆటగాళ్ల జీవితంలో గాయాలు సర్వసాధారణం అన్నారు. కాబట్టి వారు జట్టు నుంచి వెళ్లిపోయి కోలుకొని మళ్లీ అన్ని ఫార్మెట్లు ఆడాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.

