Andhra PradeshcrimeHome Page Slider

ప్రముఖ యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు

Share with

ప్రముఖ యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్(27) అనే వ్యక్తి విశాఖలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన బాలిక(14)ను యూట్యూబ్ వీడియోల పేరుతో ప్రలోభపెట్టి లొంగదీసుకున్నాడు. ఆ పరిచయంతో ఆమె అశ్లీల చిత్రాలు తీసి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనితో బాలిక గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి 2021లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేయగా, నేరం రుజువయింది.  పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.